లెజెండరీ బ్లడ్ డొనేషన్ డ్రైవ్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి

ప్రతిరక్తపు బొట్టు పోయే ప్రాణానికి ఆయు పట్టు అని ఎన్టీఆర్ ట్రస్ట్ ట్రస్టీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. ఎన్టీఆర్ 23వ వర్థంతి సందర్భంగా ఎన్టీఆర్ ట్రస్ట్, ట్రస్ట్ లెజెండరీ బ్లడ్ డొనేషన్ డ్రైవ్‌ను, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలలో 100కుపై చిలుకు చోట్ల నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఎన్టీఆర్ ట్రస్ట్ ట్రస్టీ నారా భువనేశ్వరీ హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో లాంఛనంగా ప్రారంభించారు. ప్రపంచంలో ఉన్న తెలుగు వారి హృదయాలలో చెరగని ముద్ర వేసిన వ్యక్తి ఎన్టీఆర్. ఆయన మహోన్నత వ్యక్తిత్వాన్ని, సేవాస్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని మరింత సేవ చేయాలనే ఉద్దేశంతో గత మూడేళ్లుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు భువనేవ్వరి తెలిపారు. ఈ సారి కూడా స్వచ్ఛందంగా రక్తదానానికి స్ఫూర్తినిస్తూ ట్రస్ట్ తలపెట్టిన లెజెండరీ బ్లడ్ డొనేషన్ డ్రైవ్‌లో వేల మంది ఉత్సాహంగా పాల్గొని తెలుగువారి స్ఫూర్తిని చాటాలని తెలిపారు. ఎన్టీఆర్ ట్రస్ట్ సీఈఓ టి.విష్ణువర్థన్ మాట్లాడుతూ ఎన్టీఆర్ స్ఫూర్తిలో నిర్వహించిన లెజెండరీ బ్లడ్ డొనేషన్ డ్రైవ్ కార్యక్రమానికి విశేష స్పందన లభించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ ట్రస్ట్ బ్లడ్ బ్యాంక్‌తో పాటు రెడ్‌క్రాస్, రోటరీ క్లబ్, లయన్స్ క్లబ్, గవర్నమెంట్, ఇతర బ్లడ్బాంక్స్ పాల్గొననున్నాయని తెలియజేసారు.











































































