శ్రీశైలంలో వైభవంగా లక్ష దీపోత్సవం
కార్తిక మాసం రెండో సోమవారాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లా శ్రీశైల మహాక్షేత్రంలో లక్ష దీపోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. రాత్రి ఆలయ పుష్కరిణి వద్ద వేల మంది భక్తులు దీపాలు వెలిగించారు. ముందుగా భ్రమరాంబ, మల్లికార్జున స్వామివార్ల ఉత్సవమూర్తులను శోభాయమానంగా ముస్తాయి చేసి మంగళవాయిద్వాల నడుమ పుష్కరిణి వద్దకు తీసుకొచ్చారు. పుష్కరిణి వేదికపై ఉత్సవమూర్తులను కొలువుదీర్చి అర్చకులు, వేదపండితులు దశ విధ హారతులు సమర్పించారు. అనంతరం పుష్కరిణి మెట్ల వద్ద లక్ష కార్తిక దీపాలు వెలిగించారు.













