శ్రీశైల మహాక్షేత్రంలో కనుల పండువగా ..లక్ష దీపోత్సవం
శ్రీశైల మహాక్షేత్రంలో కార్తీక మాసం మొదటి సోమవారాన్ని పురస్కరించుకుని లోక కల్యాణార్థం పుష్కరిణి వద్ద లక్ష దీపోత్సవం, పుష్కరిణి హారతి కనుల పండువగా నిర్వహించారు. పుష్కరిణి ప్రాంగాణమంతా లక్ష దీపాలను వెలగించారు. సాయంత్రం 6:30 గంటలకు శ్రీస్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను పుష్కరిణి వద్ద ఆశీనులను చేసి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీస్వామి, అమ్మవార్లకు, పుష్కరిణికి దశవిధి హారతులను ఉభయ దేవాలయాల ప్రధాన అర్చకులు వీరన్నస్వామి, మార్కండేయశాస్త్రి ఇచ్చారు. భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చి స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. దీపాలను వెలిగించారు.













