ఆయన బీజేపీని పెళ్లి చేసుకుని.. టీడీపీతో సంసారం
కాపులు ముఖ్యమంత్రి కావాలనే వారు జనసేన అధినేత పవన్ కల్యాణ్ వెంట వెళ్లి కేరింతలు కొడుతున్నారు. వారికుంటుందేమో కాపుల్ని సీఎంగా చూడాలన్న ఆలోచన నాకెందుకు ఉంటుంది? అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పవన్ కల్యాన్ అంటే నాకు అభిమానమే. సామాజికవర్గ పరంగా అభిమానం ఉంది. మేమందరం బాధపడేలా ఆయన వ్యవహరిస్తున్నారు. పవన్ కల్యాణ్, చంద్రబాబులది అపవిత్ర పొత్తు. ఆయన బీజేపీని పెళ్లి చేసుకుని టీడీపీతో సంస్కారం చేస్తానంటున్నారు. కాపుల పరువు తీయవద్దని ఆయన చెబుతున్నాం. పవన్ కల్యాణ్ వ్యవహారశైలి చూసి ఆయన్ను ఎవరికైనా చూపించండ్రా అంటూ ప్రజలు సినిమా డైలాగ్‌లు విసురుతున్నారు అని పేర్కొన్నారు. జగన్‌ను మళ్లీ అధికారంలోకి రాకుండా చేయడమనేది చంద్రబాబు, పవన్‌ల వల్ల కాదు అని పేర్కొన్నారు. తెలంగాణలో ఉన్న వ్యాపారాలు, అక్కడ ఎదురయ్యే ఇబ్బందులు కారణంగానే చంద్రశేఖర్ బీఆర్ఎస్ పార్టీలో చేరారని తెలిపారు. దేవినేని అవినాస్ వైసీపీలో ఎందుకున్నారో? వంగవీటి రాధా టీడీపీలో ఎందుకున్నారో? అనేది బెజవాడ ప్రజల్ని అడిగితే చెబుతారు అని పేర్కొన్నారు.













