ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సంచలన ప్రకటన… ఇద్దరు మంత్రులు, ఎంపీలది అదే స్థితి
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాలతోనే తన ఫోన్ ట్యాపింగ్ చేశారని, అందులో ఎటువంటి సందేహం లేదని అధికారులు, ప్రభుత్వ పెద్దలు చెప్పకపోతే ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం వారికి ఉండదని నెల్లూరు గ్రామీణ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరోసారి వైసీపీ అధిష్ఠానంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడతూ ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించిన సాక్ష్యాన్ని మీడియాకు చూపించారు. పార్టీ రీజనల్ కో ఆర్డినేటఱ్ బాలినేని శ్రీనివాసులరెడ్డి తనను రెచ్చ గొట్టబట్టే అధికారి పేరు బయట పెట్టాల్సి వచ్చిందని లేకపోతే తనకు ఆ లోచన ఉండేది కాదన్నారు. ఆయన ఈ సందర్భంగా ఇంటెలిజెన్స్ ఐజీ సీతారామాంజేయులు పోన్ నుంచి తనకు పంపిన సందేశాన్ని మీడియాకు ముందుకు వినిపించారు. అందుకు సంబంధించిన పోన్ నెంబర్ 98499 66000 కూడా చూపించారు. అయితే ఐజీ తనను హెచ్చరించడానికి ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని ప్రస్తావించారా? లేక మరో ఉద్దేశంతో చెప్పారా తనకు తెలియదు కానీ అధిష్ఠానం పెద్దల ఆదేశాలతోనే తన ఫ్లోన్ ట్యాపింగ్ జరుగుతుందని నిర్ధారణ అయిందన్నారు. అందుకే నమ్మకం లేని పార్టీలో ఉండటం ఇష్టం లేక బయటకు వెళ్లిపోవాలని నిర్ణయం తీసుకున్నానన్నారు.













