అలాంటి వ్యక్తలు రాజాకీయూల్లోకి… వస్తే ఇలాగే
రాజ్యాంగంపై ఎలాంటి అవగాహన లేని వ్యక్తులు రాజకీయాల్లోకి వస్తే ఇలాంటే ఉంటుందని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. కృష్ణ జిల్లా గుడివాడలో గడప గడపకూ ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన సభలో కొడాలి నాని మాట్లాడారు. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్‌లు చదువుతూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ చిన్నపిల్లలను రెచ్చగొట్టి పబ్బం గడుపుతున్నారని విమర్శించారు. డా.బీ.ఆర్ అంబేడ్కర్‌ను వ్యతిరేకించే వాళ్లను దేశం నుంచి బహిష్కరించాలన్నారు. అలాంటి వాళ్లను జైల్లో పెట్టాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజల సంక్షేమమే ప్రాధాన్యమని అన్నారు. మంత్రి, ఎమ్మెల్యేల ఇళ్లు కాదని చెప్పారు. కొత్త జిల్లాలపై అభ్యంతరాలు తెలిపిందుకు గడువు ఇవ్వడం రాజ్యాంగం ప్రకారం ప్రొసీజర్ అని, అది కూడా తెలియకుండా పవన్ మాట్లాడుతున్నారని విమర్శించారు.













