డిప్యూటీ కలెక్టర్‌గా కిదాంబి శ్రీకాంత్ నియామకం
భారత బ్యాడ్మింటన్ స్టార్ కిదాంబి శ్రీకాంత్‌ను స్పోర్టస్ కోటాలో డిప్యూటీ కలెక్టర్‌గా నియమించింది. ఈ నేపథ్యంలో సంబంధిత ఉద్యోగానికి అసవరమైన శిక్షణ పూర్తి చేసుకున్న కిదాంబి శ్రీకాంత్‌ను ఆంధప్రదేశ్ టూరిజం అథరిటీలో డిప్యూటీ కలెక్టర్‌గా నియమిస్తూ వైసీపీ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. మూడేళ్ల కిందట కిదాంబి శ్రీకాంత్ ఇండోనేషియా ఓపెన్ టైటిల్ నెగ్గారు. అప్పట్లో ప్రభుత్వం గ్రూప్ 1 ఉద్యోగం ఇచ్చింది. ఈ క్రమంలో డిప్యూటీ కలెక్టర్ శిక్షణ పూర్తి చేసుకున్న శ్రీకాంత్‌కు పర్యాటక శాఖలో పోస్టింగ్ ఇచ్చారు. జపాన్‌లో జరిగే ఒలింపిక్స్‌కు సన్నద్ధమయ్యేందుకు వెసులుబాటు కలిపిస్తూ బ్యాడ్మింటన్ శిక్షణ కాలాన్ని ఆన్ డ్యూటీగా పరిగణించనున్నట్లు ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో పేర్కొంది.













