శ్రీశైలంలో వైభవంగా జ్వాలా తోరణోత్సవం
శ్రీశైల మహాక్షేత్రంలో కార్తిక పౌర్ణమిని పురస్కరించుకుని జ్వాలా తోరణోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. మల్లికార్జునస్వామి, భ్రమరాంబ అమ్మవార్ల ఉత్సవమూర్తులకు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించిన తర్వాత కాగడాలతో తోరణాలను వెలిగించారు. దేదీప్యమానంగా వెలుగుతున్న జ్వాలా తోరణాన్ని వేల మంది భక్తులు దర్శించుకున్నారు.ఈ కార్యక్రమంలో మంత్రి రోజా పాల్గొన్నారు. ఆలయ పుష్కరిణి వద్ద లక్ష దీపోత్సవం కనుల పండువగా జరిగింది. కార్తిక పౌర్ణమి ఘడియలను పురస్కరించుకుని ఉదయం 4 నుంచి సాయంత్రం 4 గంటల వరకు, సాయంత్రం 5:30 నుంచి రాత్రి 11 గంటల వరకు భక్తులు భ్రమరాంబ, మల్లికార్జునస్వామి అలంకార దర్శనం చేసుకున్నారు.













