విశాఖలో మరో అంతర్జాతీయ సదస్సు

విశాఖ మరో అంతర్జాతయ సదస్సుకు వేదిక కానుంది. అధునాతన విద్యా విధానాలను అమలులోకి తెచ్చి రాష్ట్రాన్ని విద్య, విజ్ఞాన కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృషిచేస్తోంది. అందులో భాగంగానే గతేడాది డిసెంబర్ 16 నుంచి 18 వరకు నగరంలో అంతర్జాతీయ ట్రాన్స్ఫార్మింగ్ ఎడ్యుకేషన్ కాన్ఫరెన్స్ ఫర్ హ్యూమానిటీ(టెక్) సదస్సు దిగ్విజయంగా నిర్వహించారు. అదే తరహాలో ఈ ఏడాది కూడా విశాఖలోనే ఈ అంతర్జాతీయ విద్యా సదస్సును నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఏడాది నవంబర్ 15 నుంచి 17 వరకు మూడు రోజులపాటు సదస్సు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సదస్సు నిర్వహణపై యునెస్కో చీఫ్ అడ్వయిజర్ (ఈవెంట్స్) కెయిన్, రాష్ట్ర కళాశాలల విద్యా కమిషనర్ సుజాతశర్మ, విశాఖ జిల్లా జాయింట్ కలెక్టర్, కళాశాలల ప్రిన్సిపాళ్లు సమావేశమై చర్చించారు.











































































