మిస్ ఇండియాగా చంద్రగిరి యువతి భావన
ముంబయిలో జరిగిన మిస్ ఇండియా పోటీల్లో చంద్రగిరి యువతి భావన మిస్ ఇండియా టైటిల్ సాధించింది. ఈ సందర్భంగా చంద్రగిరిలోని తన నివాసంలో భావన మీడియాతో మాట్లాడుతూ కేజేయం డ్రీమ్స్ ఎంటర్టైన్మెంట్స్ ఐకానిక్ దివా సీజన్-2023 మిస్ ఇండియా టైటిల్ విన్నర్ గా నిలవటం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానన్నారు. తాను భవిష్యత్లో సైంటిస్ట్ అవ్వాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ప్రాథమిక విద్యను తమ సొంతూరు చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం, పాతగుంటలో పూర్తి చేసినానని, ప్రస్తుతం శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీలో తాను ఎంఎస్సీ బయోటెక్నాలజీ చేస్తున్నట్లు వివరించారు. కవిత కిషోర్, రియాన్ శర్మలు తనకు రోల్ మోడల్స్ అని వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. భవిష్యత్తు సమాజ సేవ చేయడానికి తనవంతు కృషి చేస్తానన్నారు. అదేవిధంగా గృహహింస నివారణ, మహిళా అక్షరాస్యతకు, పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.













