అమరావతి పోయి ఏపీ వచ్చె!
ఐ లవ్ అమరావతి బోర్డుకు కాలం చెల్లింది. ఆ స్థానంలో ఐ లవ్ ఏపీ బోర్డు వచ్చి చేరింది. దుమారం రేపిన ఢిల్లీ ఆంధ్రప్రదేశ్ భవన్లోని బోర్డు తొలగింపు వ్యవహారానికి తెరపడింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమారావతికి దేశవ్యాప్తంగా ప్రచారం కల్పించేందుకు గత ప్రభుత్వం హయాంలో ఏపీ భవన్ ప్రవేశ ద్వారం వద్ద ఏర్పాటు చేసిన ఐ లవ్ అమరావతి అనే ఇంగ్లీషు అక్షరాల బోర్డును గణతంత్ర దినోత్సవాల అనంతరం అధికారులు తొలగించారు. మూడు రాజధాను లంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తరుణంలో బోర్డును తొలగించడం వివాదాలకు, ఊహాగానాలకు తావిచ్చింది. అయితే ఆ బోర్డులోని అక్షరాలు వెలగట్లేదని, మరమ్మత్తుల కోసమే తొలగించామని ఏపీ భవన్ అధికారులు వెల్లడించారు. అనంతరం మూడు రోజులు తిరిగేసరికి ఐ లవ్ అమరావతి బోర్డు స్థానంలో ఏ లవ్ ఏపీ బోర్డు వచ్చింది. అధికారులు గతంలో బోర్డు ఉన్న స్థానంలో ఏ లవ్ ఏపీ బోర్డును పెట్టించారు. అయితే రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ బోర్డు మార్పు జరిగినట్టు తెలుస్తోంది.













