కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న హోంమంత్రి

ఆంధప్రదేశ్ రాష్ట్ర హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత గుంటూరులోని సాయి భాస్కర్ హాస్పిటల్‍లో కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ వాక్సిన్ విషయంలో ఎలాంటి అపోహలను నమ్మొద్దని ప్రజలకు సూచించారు. కరోనా విజృంభిస్తున్న తరుణంలో ప్రతిఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని కోరారు. రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్నందున మాస్క్, సానిటైజ్ చేసుకోవడం, స్వీయ నియంత్రణ పాటించడం తప్పనిసరి అన్నారు. ఇప్పటికే ఫ్రంట్‍లైన్ వారియర్లకు కరోనా వ్యాక్సిన్ వేయడం పూర్తయిందన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వాక్సినేషన్‍కు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని పేర్కొన్నారు.