విదేశాలకు వెళ్లేందుకు ఏబీ వెంకటేశ్వరరావుకు.. హైకోర్టు గ్రీన్ సిగ్నల్
ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు (ఏబీవీ)కు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఊరట లభించింది. ఆర్జిత సెలవుల (ఈఎల్)పై విదేశాలకు వెళ్లేందుకు ఉన్నత న్యాయస్థానం అనుమతించింది. ఆయన విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఏబీవీకి అనుమతి నిరాకరిస్తూ సీఎస్ ఇచ్చిన ఉత్తర్వులను ఉన్నత న్యాయస్థానం సస్పెండ్ చేసింది. విదేశీ పర్యటనకు అనుమతించాలని ఇటీవల సీఎస్‌కు ఏబీవీ దరఖాస్తు చేసుకున్నారు. ఆ అభ్యర్థనను సీఎస్ తిరస్కరించడంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు.













