ఎన్నికల టైం కావడంతో..హెలికాప్టర్ అద్దె ధరలకు రెక్కలు వచ్చాయి..
ఎన్నికల హడావిడి ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే కాదు.. ఇటు అరుణాచల్ ప్రదేశ్ అటు ఒరిస్సా లో కూడా ఎక్కువగా ఉంది. మూడు రాష్ట్రాలలో లలో అసెంబ్లీ ఎన్నికలతో పాటు పార్లమెంటు ఎన్నికలు కూడా ఉన్న నేపథ్యంలో అనూహ్యంగా హెలికాఫ్టర్లకు డిమాండ్ పెరుగుతుంది. ప్రచారాల కోసం ,సభల కోసం నేతలు తిరగాల్సిన సమయం లేదు. రోజుకు రెండు మూడు సభలలో పాల్గొనాలి.. పైగా ఒక్కొక్క సభ ఒక్కొక్క ప్రాంతంలో ఉంటుంది. వందల కొద్ది కిలోమీటర్లు సునాయాసంగా తిరగాలి అంటే హెలికాప్టర్లను మించిన సాధనం మరొకటి లేదు కదా. ఈ నేపథ్యంలో హెలికాప్టర్ల డిమాండ్ మరింత పెరిగిపోతుంది. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్నట్లు.. డిమాండ్ ఉన్నప్పుడే మంచిగా వసూలు చేసుకోవాలి అని భావించిన హెలికాప్టర్ అద్దెకిచ్చే కంపెనీలు రేట్లు విపరీతంగా పెంచేశాయి. 2019 ఎన్నికల సమయంలో హెలికాప్టర్ అద్దె గంటకు సుమారు 55 వేల నుంచి రూ.1.30 లక్షల వరకు ఉండేది. అయితే ఇప్పుడు ఏకంగా ఆ రేటును డబుల్ త్రిబుల్ చేశారు. ప్రస్తుతం గంటకు ఒక హెలికాఫ్టర్ అద్దె రూ.1.50 లక్షలు నుంచి రూ.2 లక్షల వరకు ఉండగా..చాపర్లకు రూ.4.50 లక్షల నుంచి రూ.5.50 లక్షల వరకు ఖర్చవుతుంది. అద్దెతోపాటుగా విమానాశ్రయం చార్జీలు,ఎయిర్ పోర్ట్ హ్యాండ్లింగ్ చార్జీలు,ఫ్యూయల్ ,సిబ్బంది బస, ఆహారం కు అదనంగా ఖర్చు పెట్టాల్సి వస్తుంది.













