ఎమ్మెల్సీల నామినేట్‌కు ఓకే చెప్పిన ఏపీ గవర్నర్

ఎమ్మెల్సీ ఫైలుపై ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ సంతకం చేశారు. రమేశ్ యాదవ్, లేళ్ల అప్పిరెడ్డి, తోట త్రిమూర్తులు, మోషేన్ రాజు పేర్లకు గవర్నర్ ఆమోదం తెలపడంతో వీరు నలుగురు ఎమ్మెల్సీలుగా నామినేట్ అవుతున్నారు. ఈ నలుగురు కూడా గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీ పదవులను చేపట్టనున్నారు.
సీఎం జగన్ భేటీతో మారిన సీన్…
గవర్నర్ కోటాలో నామినేట్ చేసే 4 స్థానాలు ఖాళీ అయ్యాయి. దీంతో ఆ నాలుగు స్థానాలను భర్తీ చేయాలని జగన్ నిర్ణయించుకున్నారు. తోట త్రిమూర్తులు, లేళ్ల అప్పిరెడ్డి, మోషేన్ రాజు, రమేశ్ యాదవ్‌తో కూడిన జాబితాను గవర్నర్‌కు సీఎం జగన్ పంపించారు. అయితే ఈ ఫైలు కొన్ని రోజులుగా గవర్నర్ దగ్గర పెండింగ్‌లో ఉండిపోయింది. ఎందుకంటే ఈ నలుగురిలో ఇద్దరి పేర్లపై గవర్నర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఆ ఫైలు ముందుకు కదల్లేదు. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం జగన్ సోమవారం గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌తో భేటీ అయ్యారు. ఈ ఎమ్మెల్సీ ఫైలుపైనే వీరిద్దరూ చర్చించినట్లు తెలుస్తోంది. ఈ నలుగురి నేపథ్యాన్ని సీఎం జగన్ గవర్నర్‌కు వివరించినట్లు సమాచారం. ఈ భేటీ జరిగిన కాసేపటికే గవర్నర్ విశ్వభూషణ్ ఎమ్మెల్సీ ఫైలుపై సంతకం చేశారు.