MLC elections : ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమికి మరో విజయం
ఎమ్మెల్సీ ఎన్నికల్లో (MLC elections) కూటమి మరో విజయం సాధించింది. ఉమ్మడి గోదావరి జిల్లా (Godavari District )ల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం (Rajasekhara) విజయం సాదించారు. ఏడో రౌండ్ లెక్కింపు పూర్తయ్యే సరికి విజయానికి కావాల్సిన ఓట్లు (51శాతం ) రాజశేఖరం సాధించారు. దీంతో మరో రౌండ్ లెక్కింపు ఉండగా ఆయన గెలిచినట్లు అధికారులు ప్రకటించారు. ఎన్నికల అధికారి, ఏలూరు జిల్లా కలెక్టరు (District Collector) ఆయనకు ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు. ఏడు రౌండ్లు పూర్తయ్యేసరికి మొత్తం 1,12,231 ఓట్లను పేరాబత్తుల రాజశేఖరం సాధించారు. తన ప్రత్యర్ధి దిడ్డ వీర రాఘవులు (Raghavs )కు 1,268 ఓట్లు పోలయ్యాయి. దీంతో కూటమి అభ్యర్థి 71,063 ఓట్ల అధిక్యంతో గెలుపొందారు.













