ఆమె కాంగ్రెస్ లో చేరితే స్వాగతిస్తాం : గిడుగు
వైఎస్ షర్మిలను ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నియమించబోతున్నారనే వార్త వైరల్ అవుతుంది. ఈ నేపథ్యంలో ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు స్పందిస్తూ షర్మిల ఏపీ కాంగ్రెస్ లోకి వస్తే ఆహ్వానిస్తామని అన్నారు. పార్టీ హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తాము శిరసా వహిస్తామని తెలిపారు. ఢల్లీిలో ఏపీ కాంగ్రెస్ నేతలతో అధిష్ఠానం సమావేశమవుతోంది. ఏపీ ఎన్నికలు, ప్రస్తుత పార్టీ పరిస్థితి, పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణ తదితర అంశాలపై చర్చించనున్నారు. ఇదే సమయంలో షర్మిల అంశం కూడా ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది.













