జనసేనకు షాక్
ప్రముఖ సీనియర్ పాత్రికేయులు, మాజీ ఆర్టీఐ కమిషనర్, జనసేన పార్టీ అధికార ప్రతినిధి విజయబాబు రాజీనామా చేశారు. ఆయన అకస్మాత్తుగా పార్టీకి రాజీనామా చేయడం పార్టీ శ్రేణులను, రాజకీయ వర్గాలను విస్మయానికి గురి చేసింది. గతంలో పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించిన విజయబాబు ఎందుకు పార్టీకి రాజీనామా చేశారో తెలియ రాలేదు. పార్టీలో చేరిన నాటి నుంచి ఆయన పార్టీ కార్యక్రమాల్లో ఎంతో చురుకుగా పాల్గొంటూ వచ్చారు. ఆంధ్ర, తెలంగాణ జిల్లాల్లో సైతం పర్యటించి, పార్టీ అభివృద్ధికి శ్రమించారు. తాను కేవలం వ్యక్తిగత కారణాల వల్లనే జనసేన పార్టీకి రాజీనామా చేశానని విజయబాబు సృష్టం చేశారు. ఆయన గతంలో ఆర్టీఐ కమిషనర్గా కూడా పనిచేసిన సంగతి తెలిసిందే.













