ముఖ్యమంత్రిని కలసిన ఉద్యోగ, కార్మిక సంఘాల నాయకులు
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి శ్రీ రామకృష్ణ ఆద్వర్యం లో ఉద్యోగ, కార్మిక సంఘాల నాయకులు ముఖ్యమంత్రిని ఉండవల్లి ప్రజావేదిక లో కలిశారు. వారి న్యాయమైన డిమాండ్ల ను పరిశీలించి పరిష్కరిస్తానన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు. ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్. ఎపి విద్యమిత్ర ఔట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ యూనియన్. ఆరోగ్యమిత్ర కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ యూనియన్. ఎపి స్టేట్ అగ్రికల్చర్ కో ఆపరేటివ్ సొసైటీస్ ఎంప్లాయిస్ యూనియన్. ఎపి పీఏ సీఎస్ ఎంప్లాయిస్ అసోసియేషన్. ఎపి విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల ఐక్య వేదిక. వయోజన విద్య ఒప్పంద ఉద్యోగుల సంఘం. ఉద్యోగ,కార్మిక సంఘాల అధ్యక్ష ,కార్యదర్సులు,ప్రతినిధులు ముఖ్యమంత్రిని కలసి వారి సమస్యలను వివరించారు.వారి సమస్యలను సావధానంగా విన్న ముఖ్యమంత్రి,సమస్యలన్నింటిని పరిశీలించి న్యాయమైన వాటిని పరిష్కరిస్తానని చెప్పారు.













