అంబేడ్కర్‌పై గౌరవం ఉంటే.. వారిద్దర్నీ వైసీపీ నుంచి బహిష్కరించండి

విజయవాడలోని అంబేడ్కర్ విగ్రహంపై తన పేరు తీసేశారని వైఎస్ జగన్ హడావిడి చేయడం హాస్యాస్పదమని మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ అన్నారు. అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ దళితులపై దాడులు చేసిన వారిని హత్య చేసిన వారిని పార్టీలో పెట్టుకొని జగన్ మాట్లాడటం దారుణమన్నారు. అంబేడ్కర్‌పై జగన్‌కు నిజంగా గౌరవం ఉంటే, శిరోముండనం కేసులో ఉన్న తోట త్రిమూర్తులను, దళిత డ్రైవర్‌ను చంపేసి, డోర్ డెలివరీ చేసిన అనంతబాబును వైసీపీ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశారు.