డీఎల్ రవీంధ్రారెడ్డి సంచలన వ్యాఖ్యలు.. ఎంత పెద్దవారైనా తప్పించుకోలేరు
మాజీ మంత్రి డీఎల్ రవీంధ్రారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖర్ రెడ్డిపై నిందలు వేస్తూ కొందరు మానసిక క్షోభకు గురి చేస్తున్నారంటూ అన్నారు. నిందితులను ఎవరు వెనుకోసుకొస్తున్నారో అందరికీ తెలుసంటూ వ్యాఖ్యానించారు. సీబీఐని మేనేజ్ చేసుకునే ప్రయత్నాలు చేశారని అన్నారు. అయితే ఇప్పటి వరకు సీబీఐ అధికారులు ఎవరి ఒత్తిళ్లకు లొంగలేదని, విచారణ పకడ్బందీగా జరుగుతోందని తెలిపారు. ఖచ్చితంగా వివేకా హత్య కేసు నిందితులు ఎవరో తెలుస్తుదన్నారు. ఈ కేసుతో ప్రమేయం ఉన్న ఎంత పెద్దవారైనా తప్పించుకోలేని అన్నారు.













