చంద్రబాబు పోరాటానికి ఆప్ మద్దతు : క్రేజీవాల్
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని మోసం చేశారని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ విర్శించారు. ఢిల్లీలో చంద్రబాబు చేపట్టిన ధర్మపోరాట దీక్షకు కేజ్రీవాల్ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అబద్దాలు చెప్పడంలో మోదీ దిట్టని అన్నారు. తిరుపతి వెంకన్న సాక్షిగా ఏపీకి హామీ ఇచ్చి అమలు చేయలేదని విమర్శించారు. నరేంద్రమోదీ ఒక పార్టీకి కాదు.. దేశానికి ప్రధాని అన్న విషయం మర్చిపోయారన్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పోరాటానికి ఆప్ మద్దతు ఇస్తుందన్నారు. హక్కుల కోసం పోరాడితే సీబీఐ, ఈడీతో దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు.













