ఏపీలో కర్ఫ్యూ పొడిగింపు.. సడలింపు సమయాన్ని పెంచిన ప్రభుత్వం

ఏపీలో కర్ఫ్యూను పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 20 నుంచి 30 వరకూ కర్ఫ్యూను పొడిగిస్తున్నట్లు పేర్కొంది. అయితే సడలింపుల సమయాన్ని పెంచింది. ప్రస్తుతం ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే సడలింపులు ఉండేవి. ఈ సడలింపుల సమయాన్ని ప్రభుత్వం పెంచింది. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ సడలించినట్లు పేర్కొంది. మిగతా సమయంలో కర్ఫ్యూను కఠినంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. మరోవైపు తూర్పు గోదావరి జిల్లాలో మాత్రం ఉదయం 6 నుంచి 2 గంటల వరకే సడలింపులుంటాయి. మధ్యాహ్నం 2 నుంచి ఉదయం 6 గంటల వరకూ కఠినంగా కర్ఫ్యూను అమలు చేయనున్నారు. స్థానికంగా కేసుల సంఖ్యను దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు.