పలు కీలక బిల్లులకు ఏపీ అసెంబ్లీ ఆమోదం
ఆంధప్రదేశ్ బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్ర శాసన సభ పలు కీలక బిల్లులకు ఆమోదం తెలిపింది. అభివృద్ధి వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల సమానాభివృద్ధి బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లు, దేవాదాయ చట్టంలో రెండు సవరణ బిల్లులకు శాసనసభ ఆమోదం తెలిపింది. వీటితో పాటు పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రవేశపెట్టిన పంచాయతీరాజ్ చట్టం సవరణ బిల్లును శాసన సభ ఆమోదించింది. స్థానిక సంస్థల ఎన్నికల సంస్కరణల బిల్లు, జీఎస్టీ సవరణ బిల్లు, వ్యాట్ సవరణ బిల్లు, 2020 ఎక్సైజ్ సవరణ బిల్లు, ప్రొహిబిషన్ చట్ట సవరణ బిల్లు, ఉన్నత విద్యా కమిషన్ సవరణ బిల్లు, 2020 ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌కు శాసనసభ ఆమోదం తెలిపింది.













