ఆయన మంత్రి పదవికి అనర్హుడు : రామకృష్ణ
అమరావతిని ధ్వంసం చేయాలనే కుట్రలో భాగమే మంత్రి ధర్మాన ప్రసాదరావు విపరీత వ్యాఖ్యలు చేశారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మంత్రి ధర్మాన మతిభ్రమించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. విశాఖను చిన్న రాష్ట్రంగా చేయాలనడం మంత్రి ధర్మాన ప్రసాదరావు అవివేకానికి నిదర్శనమని, ఆయన మంత్రి పదవికి అనర్హుడని అన్నారు. నెల్లూరు జిల్లా, కందకూరులో ప్రమాదవశాత్తు జరిగిన మరణాలను రాజకీయం చేయటం జగన్ మోహన్ రెడ్డికి, ఆయన సలహాదారులకు తగదన్నారు. చంద్రబాబు వల్లే కందుకూరు మరణాలు జరిగి ఉంటే ఆయనపై హత్యానేరం కేసులు ఎందుకు మోపలేదని ప్రశ్నించారు. అసలు ఏపీకి రాజధాని ఏర్పాటు చేయాలన్న ఆలోచన జగన్ మోహన్ రెడ్డికి లేదని విమర్శించారు.













