ఏపీలో కరోనాకు మరో ముగ్గురు బలి
ఆంధప్రదేశ్‌లో కరోనాతో మరో ముగ్గురు మృతి చెందినట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో మొత్తం మృతుల సంఖ్య 14కు చేరింది. వీరు ఏప్రిల్ 11, 12, 13 తేదీల్లో వివిధ చోట్ల మరణించారు. పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా తేలడంతో ఈ మేరకు ప్రకటించారు. మంగళవారం రాత్రి నుంచి బుధవారం రాత్రి 9 గంటల వరకు కొత్తగా 39 మందికి కరోనా పాజిటివ్‌గా తేలడంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 525కు చేరింది. కర్నూలు జిల్లాలో 17, గుంటూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో 8 చొప్పున కొత్తగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కడపలో 3, నెల్లూరులో 2, కృష్ణాలో ఒకటి కొత్త కేసులు తేలాయి. ఇంతవరకు రాష్ట్రంలో 20 మందిని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి చేయగా 491 మంది చికిత్స పొందుతున్నారు.













