ఏపీలో తగ్గుముఖం పడుతున్న కరోనా…

ఆంధప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 87,756 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 4,549 మందికి పాజిటివ్‍గా నిర్ధారణ అయ్యింది. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 18,14,393 మంది వైరస్ బారినపడినట్లు తెలిపింది. 24 గంటల వ్యవధిలో కొవిడ్ వల్ల 59 మంది ప్రాణాలు కోల్పోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 11,999కి చేరంది. తాజాగా 10,114 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 17,22,381 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 80,013 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 2,05,38,738 మందికి కరోనా పరీక్షలు పూర్తి చేశారు.
కరోనా కారణంగా గడిచిన 24 గంటల్లో చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 12 మంది, ప్రకాశంలో 8 మంది, పశ్చిమగోదవరిలో ఆరుగురు, కృష్ణ జిల్లాలో ఐదుగురు, అనంతపురం, తూర్పుగోదావరి, శ్రీకాకుళం జిల్లాల్లో నలుగురు చొప్పున గుంటూరు, కర్నూలు, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో ముగ్గురు చొప్పున, కడప, నెల్లూరులో ఇద్దరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు.