ఏపీలో కొత్తగా 7,796 కేసులు… 77 మరణాలు

ఆంధప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ఉధృతి క్రమంగా తగ్గుతున్నది. గడిచిన 24 గంటల్లో 89,732 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 7,796 కేసులు నమోదయ్యాయి. 77 మంది మృతి చెందారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. కరోనా నుంచి 14,641 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,07,588 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు 1,99,46,253 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.
చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 12 మంది, పశ్చిమ గోదావరి జిల్లాలో 10, అనంతపురం, నెల్లూరు జిల్లాల్లో 8 మంది చొప్పున మృతి చెందారు. శ్రీకాకుళంలో ఏడుగురు, తూర్పు గోదావరి, విశాఖ జిల్లాలో ఆరుగురు చొప్పున, విజయనగరం జిల్లాల్లో ఐదుగురు మృతి చెందారు. గుంటూరు, ప్రకాశం జిల్లాలో నలుగురు చొప్పున మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందినవారి సంఖ్య 11,629కి చేరింది.