ఏపీలో భారీగా తగ్గిన కేసులు..

ఆంధప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గు ముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో 64,800 మందికి కరోనా పరీక్షలు నిర్వహంచగా.. 4,872 మందికి కరోనా పాజిటివ్‍గా నిర్ధారణ అయింది. ఈ మేరకు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా బులిటెన్‍లో తెలిపింది. తాజాగా 13,702 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,14,510 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 24 గంటల్లో కరోనాతో 86 మంది మృతి చెందారు. అత్యధికంగా చిత్తూరులో 13 మంది మృతి చెందగా, గుంటూరు 10 మంది, శ్రీకాకుళం 9 మంది, విజయనగరం, పశ్చిమగోదావరిలో ఏడుగురు చొప్పున, ప్రకాశం, విశాఖపట్నం ఆరుగురు చొప్పున, తూర్పు గోదావరి, కృష్ణా, కర్నూలు 5 మంది చొప్పున, నెల్లూరులో నలుగురు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనాతో 11,552 మంది మృతి చెందారు.