ఏపీలో కొత్తగా 4,147 కరోనా కేసులు

ఆంధప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. 24 గంటల్లో 96,121 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 4,147 కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. 24 గంటల్లో 38 మంది మృతి చెందారు. 24 గంటల్లో కరోనా నుంచి 5,773 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 46,126 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా కేసులు 18,75,622 చేరగా, కరోనాతో 12,566 మంది మృతి చెందారు.
కరోనాతో చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో ఏడుగురు చొప్పున మృతి చెందగా, తూర్పుగోదావరి, కృష్ణా జిల్లాల్లో ఐదుగురు చొప్పున మృతి ప్రాణాలు కోల్పోయారు. అలాగే శ్రీకాకుళంలో నలుగురు, పశ్చిమ గోదావరిలో ముగ్గురు, అనంతపురం, కడప, విశాఖపట్నంలో ఇద్దరు చొప్పున మృతి చెందారు. విజయనగరంలో ఒకరు మృతి చెందారు.