ఏపీలో తగ్గుతున్న కరోనా కేసులు…

ఆంధప్రదేశ్ రాష్ట్రంలో కరోనా ఉధృతి క్రమంగా తగ్గుతున్నది. గడిచిన 24 గంటల్లో 91,849 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 4,458 కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. 24 గంటల్లో 6,313 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 18,08,262 మంది డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం 47,790 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 24 గంటల్లో 38 మంది మృతి చెందారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 12,528కు చేరుకుంది. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 2,15,41,486 నమూనాలను పరీక్షించారు.