ఏపీలో తగ్గుముఖం పట్టిన కరోనా..

ఆంధప్రదేశ్ రాష్ట్రంలో రోజురోజుకూ కరోనా వైరస్ మరింత తగ్గుముఖం పడుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 88,622 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా కొత్తగా 4,981 కేసులు నిర్ధారణ అయ్యాయి. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు 18,67,017 మంది వైరస్ బారినప పడ్డారు. 24 గంటల్లో 38 మంది మరణించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కరోనాతో 12,490 మంది మరణించారు. 24 గంటల్లో 6,464 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 18,04,844కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 49,683 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 2,14,49,636 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. కొత్తగా అత్యధికంగా చిత్తూరులో ఏడుగురు, తూర్పుగోదావరి, కృష్ణా జిల్లాల్లో ఐదుగురు చొప్పున, గుంటూరు, నెల్లూరు జిల్లాలో నలుగురు చొప్పున, శ్రీకాకుళం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ముగ్గురు చొప్పున, అనంతపురం, కడప, విశాఖ, విజయనగరంలో ఒకరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు.