ఏపీలో కొత్తగా 4,684 కరోనా కేసులు
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 80,712 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 4,684 కేసులు నిర్ధారణ అయ్యాయి. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 18,62,036 మంది కరోనా బారినపడినట్లు వెల్లడించింది. 24 గంటల వ్యవధిలో 36 మంది మరణించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కరోనాతో 12,452 మంది మరణించారు. 24 గంటల్లో 7,324 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 17,98,380కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 51,204 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 2,13,61,014 మంది కరోనా పరీక్షలు చేయించుకున్నారు. అత్యధికంగా చిత్తూరులో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు.







