ఏపీలో కొత్తగా 6,151 కేసులు… 58 మంది

ఆంధప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 1,02,712 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 6,151 కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. 24 గంటల్లో 58 మంది మృతి చెందారు. రాష్ట్రంలో మరో 7,728 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 17,50,904 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 69,831 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 24 గంటల్లో అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 1,244 కేసులు నమోదు కాగా, అత్యల్పంగా విజయనగరంలో 199 కేసులు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా నిన్న ఒక్క రోజే 12 మంది మృతి చెందారు.