ఏపీలో కొత్తగా 5,741 కేసులు …

ఆంధప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 96,153 మందికి కరోనా పరీక్షలు చేయగా, కొత్తగా 5,741 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. కరోనాతో 53 మంది మరణించారు. 24 గంటల్లో 10,567 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు డిశ్చార్జి అయినవారి సంఖ్య 17,32,984గా ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం 75,134 యాక్టివ్ కేసులు ఉన్నాయి. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 830 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 12 మంది మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 12,052కు చేరింది.