అధికారంలోకి రాగానే హోదా ఫైలుపైనే తొలి సంతకం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను ప్రధాని మోదీ మోసం చేశారని ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి మండిపడ్డారు. ఏపీ ప్రజల ముందు టీడీపీ, బీజేపీ దోషులుగా నిలబడ్డాయని అన్నారు. టీడీపీ, బీజేపీ, వైసీపీ నేతలంతా మోసగాళ్లని ఆయన ఆరోపించారు. 2019లో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే హోదా ఫైలుపై తొలి సంతకం ఉంటుందని సృష్టం చేశారు. టీడీపీ-బీజేపీ ఒక్కటేనని కేంద్రహోంమంత్రి రాజ్‌నాథ్ చెప్పారని, ఓట్ల కోసమే మళ్లీ కొత్త నాటకం ఆడుతున్నారని రఘువీరా విమర్శించారు. ఏపీపై కేంద్ర వైఖరికి నిరసనగా ఢిల్లీలోని ఏపీ కాంగ్రెస్ నిరసనకు దిగింది. ఏపీ భవన్‌లోని అంబేద్కర్ విగ్రహం వద్ద రఘువీరారెడ్డి, కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి తదితరులు ఆందోళనకు చేపట్టారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అంటూ నినాదాలు చేశారు.













