కేసుల సంఖ్య తగ్గించి చూపడం లేదు: వైఎస్ జగన్
కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉన్నా మనం కేసుల సంఖ్యను తక్కువ చేసి చూపడం లేదని రోజుకు 50వేల పరీక్షలు చేస్తున్న తొలి రాష్ట్రం మనదేనని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పారు. పలు అంశాలపై మంగళవారం అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కరోనా పరిస్థితిపై మాట్లాడుతూ చాలా చోట్ల కేసులు ఎక్కువ రాగానే పరీక్షలు తగ్గించి కేసులు తగ్గించి చూపుతున్నారు కానీ మన రాష్ట్రంలో అలా చేయడం లేదన్నారు. కరోనాతో చనిపోయిన వారి అంత్యక్రియల కో్సం రూ. 15వేలు ఇస్తున్నామని, బంధువులు అంత్యక్రియలు నిర్వహించకపోతే ప్రభుత్వమే అంత్యక్రియలు నిర్వహిస్తుందని తెలిపారు.
కరోనాతో చనిపోయిన వారి అంత్యక్రియల కో్సం రూ. 15వేలు ఇస్తున్నామని, బంధువులు అంత్యక్రియలు నిర్వహించకపోతే ప్రభుత్వమే అంత్యక్రియలు నిర్వహిస్తుందని తెలిపారు. సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో ప్రతి అధికారీ, దిగువ స్థాయి సిబ్బంది వరకూ చిత్తశుధ్దితో పనిచేస్తున్నారన్నారు. కేసులు పెరుగుతున్నా కరోనాపై భయాందోళనలు అవసరం లేదు. ధైర్యంగా దానిని ఎదుర్కుందామని పిలుపిచ్చారు. వ్యాక్సిన్ వచ్చేవరకూ కరోనాతో కలిసి బ్రతకాల్సిందేనన్నారు. కరోనాని ఎదుర్కునే చర్యల్లో భాగంగా వచ్చే 6నెలల్లో 15వేల మంది డాక్టర్ల నియామకం జరుపనున్నామన్నారు. నాణ్యమైన ఆహారం, పరిశుభ్రత, మందులు అవసరమన్నారు. ప్రతి రోగికీ కనీస ఖర్చు కింద 3500గా కేటాయించామన్నారు. ఆక్సిజన్ బెడ్స్ పెంచాలని నిర్ణయించామన్నారు. కరోనా తగ్గగానే రచ్చబండ..
తండ్రి బాటలోనే రచ్చబండ కార్యక్రమం నిర్వహిస్తానని జగన్ చెప్పారు. ఈ కార్యక్రమం కింద గ్రామాల్లో పర్యటిస్తానని పధకాల అమలు సమీక్షిస్తానన్నారు. కరోనా పరిస్థితులు సద్ధుమణగగానే ఈ కార్యక్రమం ఉంటుందన్నారు.













