ధర్డ్‌వేవ్ కు సన్నద్ధమవుతున్న ఏపీ ప్రభుత్వం.. తల్లిదండ్రులకు అవగాహన పెంచాలని జగన్ ఆదేశాలు

ధర్డ్‌వేవ్ వస్తుందన్న వార్తల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ముఖ్యంగా ధర్డ్ వేవ్ పిల్లలపై తీవ్ర ప్రభావం చూపించబోతోందన్న వార్తల నేపథ్యంలో జగన్ ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలను తీసుకుంటోంది. చిన్నారుల కోసం రాష్ట్రంలో మూడు కేర్ సెంటర్లను ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ఱయం తీసుకుంది. విశాఖ, తిరుపతి, విజయవాడ, గుంటూరులో ఈ కేర్ సెంటర్లను ఏర్పాటు చేయాలని జగన్ అధికారులకు సూచించారు. ఒక్కో కేంద్రానికి 180 కోట్లతో ప్రణాళికలను కూడా సిద్ధం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. కరోనా మూడో వేవ్‌పై తల్లిదండ్రులందరికీ అవగాహన కల్పించాలని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించాలని అధికారులను కోరారు. ఈ విషయంలో ఆరోగ్య కార్యకర్తలను, ఆశా వర్కర్లను అలర్ట్ చేయాలని, తగు శిక్షణను కూడా ఇప్పించే ప్రయత్నాలను ప్రారంభించాలని జగన్ సూచించారు. యుద్ధ ప్రాతిపదికన పిల్లల వార్డుల అభివృద్ధికి తగు చర్యలు తీసుకోవాలని, మెడికల్ కాలేజీల్లో పీడియాట్రిక్ వార్డుల అభివృద్ధిపై దృష్టి సారించాలని జగన్ కోరారు. అయితే వీటి అభివృద్ధి చేసే విషయంలో ఎంత ఖర్చైనా ఇబ్బంది లేదని, తగు ఏర్పాట్లు చేయాలని సీఎం జగన్ ఆదేశించారు.