అగ్రిగోల్డ్‌లో డిపాజిట్ చేసి మోసపోయిన బాధితులకు నగదు చెల్లింపు
అగ్రిగోల్డ్‌లో డిపాజిట్ చేసి మోసపోయిన డిపాజిట్‌దారులకు పాదయాత్రలో, మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు నగదు చెల్లింపు. అగ్రిగోల్డ్‌లో రూ.10వేల లోపు డిపాజిట్ చేసి మోసపోయిన మరో 3.86 లక్షల మంది డిపాజిటర్లకు రూ.207.61 కోట్లను, రూ.10 వేల నుంచి రూ.20వేల లోపు డిపాజిట్ చేసి మోసపోయిన దాదారు 3.14 లక్షల మంది బాధితులకు రూ. 459.23 కోట్లను, గౌరవ హైకోర్టు నిర్దేశించిన విధంగా మొత్తం 7 లక్షలకు పై చిలుకు అర్హులైన అగ్రిగోల్డ్ బాధితులను గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా గుర్తించి, సీఐడీ ద్వారా నిర్ధారించి రూ.666.84 కోట్లను క్యాంప్ కార్యాలయంలో కంప్యూటర్ బటన్ నొక్కి వారి ఖాతాల్లో జమ చేసిన సీఎం వైయస్.జగన్.













