ఆంధ్రప్రదేశ్ గవర్నర్ కు సీఎం జగన్ పుట్టినరోజు శుభాకాంక్షలు
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పుట్టిన రోజు సందర్భంగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి హార్దిక శుభాకాంక్షలు తెలిపారు. “గౌరవనీయ గవర్నర్ శ్రీ బిశ్వభూషణ్ హరిచందన్ గారూ, మీకు హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. దేవుడు మిమ్మల్ని ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించేలా దీవించాలని కోరుకుంటున్నాను” అంటూ జగన్ తన ట్వీట్ లో పేర్కొన్నారు. ప్రస్తుతం సీఎం జగన్ తన కుటుంబంతో కలిసి జెరూసలెం పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. గవర్నర్ హరిచందన్ తన 85 పుట్టినరోజు వేడుకలను గిరిజన, దళిత చిన్నారులతో జరుపుకున్నారు. పలు ప్రజాహిత కార్యక్రమాలు నిర్వహించారు. శనివారం ఉదయం తిరుమల తిరుపతి దేవస్థానం, కనకదుర్గమ్మ దేవస్థానం వేదపండితులు ఆయనకు ఆశీర్వచనం అందించారు.













