త్వరలోనే విశాఖ కేంద్రంగా.. రైల్వే జోన్ : సీఎం రమేశ్
త్వరలోనే విశాఖ కేంద్రంగా రైల్వే జోన్‌కు భూమి పూజ జరుగుతుందని కేంద్ర రైల్వే పార్లమెంటరీ కమిటీ చైర్మన్ సీఎం రమేశ్ తెలిపారు. కేంద్ర రైల్వే పార్లమెంటరీ కమిటీ చైర్మన్‌గా ఎంపికైన తరవాత తొలిసారిగా విశాఖకు వచ్చిన అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్‌కు విమనాశ్రయంలో కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో రైల్వే జోన్ కార్యాలయం, ఇతర కార్యకలాపాలకు కావలసిన భూమిని రైల్వే శాఖకు అందించారని తెలిపారు. ఉత్తరాంధ్రతో పాటు, రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టుల అభివృద్ధి కృషి చేస్తానన్నారు.













