Chandrababu : కేంద్ర ప్రభుత్వానికి, నిర్మలా సీతారామన్‌కు.. చంద్రబాబు అభినందనలు
కేంద్ర బడ్జెట్ 2025ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) స్వాగతించారు. దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అయిన మధ్యతరగతి ప్రజలకు పన్ను మినహాయింపు గొప్ప పరిణామమని తెలిపారు. ప్రధాని మోదీ (Modi) వికసిత్ భారత్ దార్శనికతను బడ్జెట్ ప్రతిబింబిస్తోందన్నారు. ప్రజా అనుకూల ప్రగతిశీల బడ్జెట్‌ను ఇవాళ నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) ప్రవేశపెట్టారన్నారు. మహిళలు, పేదలు, యువత, రైతుల సంక్షేమానికి ప్రాధాన్యతనిచ్చారన్న సీఎం, రాబోయే ఐదేళ్లలో వృద్ధికి ఆరు కీలక రంగాలను బడ్జెట్ గుర్తించిందన్నారు. జాతీయ శ్రేయస్సు దిశగా ఈ బడ్జెట్ కీలక అడుగులు సూచిస్తోందని తెలిపారు. దేశానికి సుసంపన్నమైన భవిష్యత్తును వాగ్దానం చేస్తూ సమగ్రమైన బ్లూప్రింట్ (Blueprint)గా పనిచేస్తుందన్నారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు చంద్రబాబు అభినందనలు తెలిపారు.













