ఆ రోజు కోసమే తెలుగు ప్రజలు… చింతమనేని
రాజకీయాన్ని రాజకీయంగానే ఎదుర్కోవాలని తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నారు. కోడీ పందేల వ్యవహారంలో చింతమనేని ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపధ్యంతో ఆయన స్పందించారు. కోడి పందేల్లో లేని వ్కక్తిని ఉన్నట్లు చూపించడం కొందరి జెండా అజెండా అన్నారు. ఇంత రాక్షస రాజకీయం అవసరమా? అని ప్రశ్నించారు. రాజకీయాన్ని రాజకీయంగానే ఎదుర్కోవాలి. నీచమైన ప్రచారంతో కుప్పకూలే మేడలు కట్టి అధికారంలోకి వచ్చారు. తెలుగు ప్రజల్లో విష బీజాలు నాటి నాడు అధికారం చేపట్టారు. ఆ మేడలు కూలిపోయే సమయం ఆసన్నమైందన్నారు. అసత్యాల సాక్షిని ప్రజలు కూకటివేళ్లతో ప్రక్షాళన చేసే సమయం వచ్చిందన్నారు. ఆరోజు కోమే తెలుగు ప్రజలు ఎదురు చేస్తున్నారు. మీ రాక్షస రాజకీయ వికటాట్టహాసానిక ముగింపు త్వరలోనే అని అన్నారు.













