ట్రెండ్ మారింది.. వైసీపీ బెండు తీస్తారు : చంద్రబాబు
జగన్ ఇంటికి పోవడం ఖాయమని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రొద్దుటూరు ప్రజాగళం సభలో చంద్రబాబు మాట్లాడారు. ఐదేళ్లలో రాయలసీమకు ఏం చేశారో చెప్పాలని సవాల్ విసిరారు. జగన్‌కు రాయలసీమ అంటే హింస, హత్యా రాజకీయాలు, టీడీపీకి సీమ అంటే నీళ్లు, ప్రాజెక్టులు, పరిశ్రమలు. రైతును రాజు చేయడం టీడీపీ సంకల్పం. పులివెందుల ప్రజలు కూడా జగన్‌ను నమ్మేది లేదంటున్నారు. విపరీతమైన మార్పు వచ్చింది. ట్రెండ్ మారింది. వైసీపీ బెండు తీస్తారు. వైసీపీ నేతల దాడులకు టీడీపీ కార్యకర్తలు భయపడలేదు. కడపకు స్టీల్‌ప్లాంట్ వచ్చి ఉంటే వేలమందికి ఉద్యోగాలు వచ్చేవి. శంకుస్థాపనలు కాదు, ప్రారంభోత్సవాలు జరగాలి. రాయలసీమకు మేం కియా మోటార్స్ తీసుకొచ్చాం. కరవుసీమలో తయారైన 12 లక్షల కార్లు ప్రపంచంలో పరిగెడుతున్నాయి. నా బ్రాండ్ కియా మోటర్స్ తేవడం. జగన్ బ్రాండ్ వేసిన స్టీల్‌ప్లాంట్‌ను మళ్లీ శంకుస్థాపన చేయడం, పరిశ్రమలు తేకపోగా, ఉన్నవాటిని తరమివేశారు అని అన్నారు.
జగన్‌కు నీటి విలువ, ప్రాజెక్టుల గురించి తెలుసా? రాయలసీమకు నీళ్లిస్తే కోనసీమ కంటే మిన్నగా తయారవుతుంది. కృష్ణా జలాలు రాయలసీమకు తీసుకురావాలనేది నా కల. పోలవరం పూర్తి గోదావరి నీళ్లు రాయలసీమకు తీసుకురావాలి. ఆ సంకల్పంతోనే 72 శాతం పనులు పూర్తి చేశాం. ఈ ఐదేళ్లలో రాయలసీమలో ఒక్క కంపెనీ అయినా వచ్చిందా? రాయలసీమను రతనాల సీమగా మార్చే బాధ్యత నాది. క్విట్ జగన్, సేవ్ రాయలసీమ నినాదం కావాలి. ఈ అసమర్థ అవినీతి ప్రభుత్వాన్ని తరిమికొట్టాలి అని పిలుపునిచ్చారు.













