హోంమంత్రే అలా మాట్లాడితే ఎలా ?
దేవుడు, ప్రజల ఆశీస్సుల వేల్ల అలిపిరి దాడిలో మృత్యువు నుంచి బయట పడ్డానని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ఉండవల్లిలోని తన నివాసంలో పార్టీ నేతలతో ఆయన సమావేశమయ్యారు. తన భద్రత కుదింపుపై మాట్లాడుతూ ప్రజలే తనకు రక్షకులని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ప్రతి పౌరుడి భద్రత, రక్షణ బాధ్యతా ప్రభుత్వానిదేనని చెప్పారు. గత ఐదు వారాలుగా రాష్ట్రంలో దాడులు, దౌర్జన్యాలు పెరగడం బాధాకరమని అన్నారు. ఏపీ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటే రాష్ట్రాభివృద్ధికి తాను చేసిన కృషి అంతా బూడిద పాలవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో టీడీపీ కార్యకర్తలపై జరుగుతున్న దాడులపై హోంమంత్రి సుచరిత చేసిన వ్యాఖ్యలను చంద్రబాబు ప్రస్తావించారు. సాక్షాత్తూ హోంమంత్రే ఎన్నో జరుగుతుంటాయి. అన్నింటికీ కాపలా ఉంటామా? అంటే సామాన్యూడికి రక్షణగా ఎవరంటూ ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులో ఉన్నప్పుడే పెట్టుబడులకు ఆస్కారముంటుందన్నారు.













