ఇది రౌడీ రాజ్యమా? ప్రజాస్వామ్యమా?
వైసీపీ నేతలపై తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ కార్యకర్తలపై వైసీపీ నేతలు దాడులను ఆపాలని హెచ్చరించారు. రాజీనామా చేయాలని అంగన్వాడీ టీచర్లను వైసీపీ నేతలు బెదిరిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. వైసీపీ కార్యకర్తల ఆగడాలను తూర్పాబట్టారు. కాంట్రాక్టర్లు, కేబుట్ ఆపరేటర్లను బెదిరిస్తున్నారని ధ్వజమెత్తారు. ఇదీ రౌడీ రాజ్యమా? ప్రజాస్వామ్యమా? మేము రౌడీయిజం చేస్తే మీరెక్కడ ఉండేవారు? మా కార్యకర్తలపై దాడులు చేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా? ఇకపై వైసీపీ నేతల ఆగడాలను సహించేది లేదని హెచ్చరించారు.













