పశ్చిమలో ‘సైకిల్’ పరేషాన్..
బెజవాడ పశ్చిమలో టీడీపీ టికెట్ ఫైట్ తీవ్రరూపు దాల్చింది. తనకే ఇవ్వాలని ఓవైపు బుద్దావెంకన్న, మరోవైపు జలీల్‌ఖాన్ ప్రయత్నాలు చేస్తున్నారు. టికెట్ తనకు ఇవ్వాలని దుర్గగుడికి ర్యాలీగా వెళ్లి బల ప్రదర్శన నిర్వహించారు బుద్ధా వెంకన్న. కేశినేనినానికి బుద్ది వచ్చేలా చేసేందుకే తాను ఈ ర్యాలీ చేపట్టినట్లు బుద్ధా వెంకన్న తెలిపారు. ఇటీవలి కాలంలో చంద్రబాబు, లోకేష్‌లను విమర్శిస్తున్న నేతలు టార్గెట్‌గా బుద్ధా వెంకన్న చెలరేగిపోతున్నారు. వారికి మాటలతో తగిన కౌంటర్లు వేస్తున్నారు.దీంతో బుద్ధాకు హైకమాండ్ దగ్గర మంచి వెయిట్ ఉంది టాక్ నడుస్తోంది.
విజయవాడ పశ్చిమం లేదా అనకాపల్లి ఎంపీగా పోటీ చేస్తానని బుద్దా వెంకన్న చెబుతున్నారు. తనకు టికెట్ కేటాయించాలని చంద్రబాబు, పవన్‌కు విజ్ఞప్తి చేస్తున్నారు. చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకున్నా శిరసావహిస్తానని చెప్పారు. కేశినేని నాని అనే వ్యక్తికి తగిన బుద్ధి చెప్పాలని ర్యాలీగా వచ్చానని చెప్పుకొచ్చారు బుద్దా వెంకన్న ముఖ్యంగా జలీల్ ఖాన్.. మైనార్టీ వాదనను తెరపైకి తెచ్చారు. విజయవాడ నుంచి శ్రీకాకుళం వరకూ మైనార్టీలకు ఇవ్వడానికి సరైన సీటులేదన్న జలీల్ ఖాన్.. గెలిచే సీటును మైనార్టీలకు ఇవ్వాలన్నారు. ఈ సీటును ఇవ్వకుండే మైనార్టీలు ఏం చేసుకుంటారో తెలియదంటూ హైకమాండ్ సున్నితంగా వార్నింగిచ్చారు.
టీడీపీలో నాలుగేళ్లుగా పనిచేస్తున్నానని.. తనకు చంద్రబాబు,లోకేష్ న్యాయం చేస్తారన్న నమ్మకముందన్నారు జలీల్‌ఖాన్. ఇక ఇదే విషయమై జనసేన చీఫ్ పవన్‌తోనూ మాట్లాడానన్నారు జలీల్‌ఖాన్. పొత్తులో భాగంగా ఈసీటు కోరొద్దని పవన్‌కు చెప్పినట్లు తెలిపారు జలీల్‌ఖాన్. పశ్చిమలో అత్యధికంగా ముస్లిం మైనార్టీ ఓట్లున్నాయి. గత ఎన్నికల్లోసైతం మంచి మెజార్టీనే సాధించారు. ఈ క్రమంలో ఈసారి సీటిస్తే తాము గెల్చి తీరతామంటున్నారు జలీల్. అంతేకాదు.. ఈసీటు ప్రభావం, పార్లమెంటు స్థానంపైనా పడుతుందని చెబుతున్నారు జలీల్‌ఖాన్. దీంతో ఈసమస్యను ఎలా పరిష్కరించాలో అర్థంకాక .. టీడీపీ హైకమాండ్ బుర్రపట్టుకుంటోంది.













