శ్రీవారి పుష్కరిణిలో వైభవంగా చక్రస్నానం
తిరుమలేశుని వార్షిక బ్రహ్మూెత్సవాల్లో భాగంగా పుష్కరిణిలో శ్రీవారికి చక్రస్నాన కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ వేకువ జామున శ్రీవారి ఆలయం నుంచి శ్రీదేవి, భూదేవి సమేత మళయప్పస్వామి వారు వరాహ పుష్కరిణి చెంతకు ఊరేగింపుగా చేరుకున్నారు. అక్కడ ఉత్సవమూర్తులకు, చక్రతాళ్వారుకు అభిషేకాలు, స్నపన తిరుమంజనం ప్రక్రియను అర్చకులు వేడుకగా నిర్వహించారు. అనంతరం మంగళ వాయిద్యాలు, వేద మంత్రోత్చరణల నడుమ పెద్దజీయర్ సమక్షంలో అర్చకులు చక్రతాళ్వారుకు పుష్కర స్నానం చేయించారు. ఈ సమయంలో వేలాది మంది భక్తులు గోవింద నామస్మరణలతో పుణ్యసాన్నానాలు ఆచరించారు.













