విశాఖ ప్రజలు శుభవార్త వింటారు : విష్ణు
10 రోజుల్లో విశాఖ ప్రజలు శుభవార్త వింటారని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్రాజు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ విశాఖ రైల్వేజోన్ తీసుకొచ్చే బాధ్యత తమదేనని అన్నారు. విశాఖ రైల్వే జోన్ ఇచ్చేది మేమే.. తెచ్చేది మేమేనని వ్యాఖ్యానించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ సభను అడ్డుకుంటామని ఎందుకు అంటున్నారని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రానికి ఎక్కువ నిధులు ఇచ్చినందుకా? రైల్వే జోన్ ఇస్తామని చెప్పినందుకా? అని ఆయన ప్రశ్నించారు. మార్చి 1న రైల్వే గ్రౌండ్లో మోదీ సభ జరుగుతుదని సృష్టం చేశారు.













