వచ్చే ఎన్నికల్లో జనసేన తో కలిసి.. సునీల్ దేవ్‌ధర్
వచ్చే ఎన్నికల్లో జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తాయని, తెలుగుదేశం పార్టీతో తాము పొత్తు పెట్టుకోమని బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి సునీల్ దేవ్‌ధర్ స్పష్టం చేశారు. ఈ సంద్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ అడిగిన రోడ్ మ్యాప్‌పై అంతర్గంగా చర్చించుకుంటామన్నారు. మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ వ్యవహారాన్ని తాము సీరియస్‌గా తీసుకోవట్లేదన్నారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు, కన్నా లక్ష్మీనారాయణ మధ్య ఎలాంటి విభేదాలు లేవని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో ఓటు వేసిన ప్రజలకే వైసీపీ వెన్నుపోటు పొడుస్తోందని విమర్శించారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకునే టీడీపీ పొత్తు పెట్టుకోరాదని నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.













